NTV Telugu Site icon

Priyanka Mohan: తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ ప్రియాంక మోహన్

Priyanka Mohan Injured

Priyanka Mohan Injured

Priyanka Mohan Escaped Accident at Thorrur: తృటిలో ప్రమాదం నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ బయటపడింది. అసలు విషయం ఏమిటంటే తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ ప్రారంభోత్సవం సమయంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ అతిధుల ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన స్టేజ్ కుప్పకూలిన కామంతో ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి విచ్చేశారు. అయితే స్టేజి ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి సినీ నటి ప్రియాంక మోహన్ బయటపడినట్టు అయింది. అయితే ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిని మాత్రం హాస్పిటల్ కి తరలించారు. నిజానికి షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలినట్టు చెబుతున్నారు. వేదిక పైన ఉన్న నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాలికి గాయాలు కావడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ కిందపడిపోయినా కూడా గాయాలు కాలేదని తరువాతి వీడియోలో క్లారిటీగా ఉంది. అయితే ఆమెను వెంటనే షాపింగ్ మాల్ లోపలికి తీసుకు వెళ్లారు నిర్వాహకులు.

Show comments