Site icon NTV Telugu

Priyanka Mohan: ఇదిగో ప్రియాంక.. తెలుసుకుని మాట్లాడు లేదంటే..?

Untitled Design (26)

Untitled Design (26)

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ అటు తమిళ్ ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. తెలుగులో ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అలాగే పవన్ కల్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలోనూ నటిస్తోంది. మరోవైపు తమిళంలో జయం రవి సరసన ‘బ్రదర్’ సినిమాలో నటిస్తూ రెండు చేతులారా సంపాదిస్తుంది ఈ అమ్మడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక మోహన్ చేసిన వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి.

Also Read: Rao Ramesh : రండి బాబు రండి.. సినిమా చూస్తే లక్ష రూపాయలు.. త్వరపడండి

ఆ ఈవెంట్ లో ప్రియాంక మాట్లాడుతూ ” నాకు ఇది స్పెషల్ ఫిలిం. దానయ్యగారు నాకు ఓజి. సినిమాలో కూడా అవకాశం కల్పించారు. నా కెరీర్ లో ఈ రెండూ చాలా ఇంపార్టెంట్, ఎస్.జె. సూర్య తో తమిళంలో డాన్ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. అలాగే ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్ తో చేయండి అని” ఎస్.జె.సూర్యను కోరింది. ఆ మాటలే విజయ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమానుని తమిళంలో విజయ్ చేసిన ఖుషి నుండి రీమేక్ చేశారు, అసలు ఖుషి -2 తీస్తే తమిళంలో విజయ్ తో తీయాలి కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ తో తీయమని ప్రియాంక అడగడం ఏంటి అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ప్రియాంక నటించిన సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29న రిలీజ్ కి రెడీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలల వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది సరిపోదా శనివారం.

Exit mobile version