Site icon NTV Telugu

జవల్కర్ సొగసుల జాతర…

Priyanka Jawalkar Latest Photoshoot Goes Viral

తెలుగు తెరపై దేనికైనా కొరత ఉంటుంది అంటే… అది తెలుగు అమ్మాయిల దర్శనాలకే! కారణాలు ఏమైనా టాలీవుడ్ లో లోకల్ బ్యూటీస్ తక్కువే. ఉన్న వారిలో రేసులో నిలవగలిగేది ఇంకా తక్కువ. అలా అతి తక్కువ అంధ్రా అందగత్తెల్లో అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కూడా ఒకరు! ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఈ మరాఠీ ముల్గీ తెలుగమ్మాయి కాకపోయినా పుట్టి, పెరిగింది మొత్తం ఏపీలోనే! అయితే, ఆ మధ్య ‘టాక్సీవాలా’ చిత్రంలో కనిపించిన టాలెంటెడ్ బేబ్ మళ్లీ చాన్నాళ్లు ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. అయితే, తాజాగా ‘తిమ్మరుసు’ చిత్రంతో అందరూ తనవైపు తిరిగి చూసేలా చేసుకోగలిగింది…

Read Also : భాస్కరభట్ల ‘కాటుక కనులే’ పాట సరికొత్త రికార్డ్!

ప్రియాంక జవల్కర్ కొంత గ్యాప్ తరువాత జనం ముందుకొచ్చిన ‘తిమ్మరుసు’ మూవీ మంచి రెస్పాన్సే పొందుతోంది. అయితే, వెంటనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో కుర్రాళ్లను టార్గెట్ చేయబోతోంది మిస్ జవల్కర్! ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలోనూ ఈమే హీరోయిన్. ఆల్రెడీ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటి వాటికి మంచి క్రేజ్ వచ్చింది. ఎస్పెషల్లీ, ప్రియాంక అందం మరోసారి అబ్బాయిల్ని ఆకట్టుకుంటోంది! అయితే, పెద్ద తెరపై సందడి ఎలా ఉన్నా సొషల్ మీడియాలోనూ జవల్కర్ సైలెంట్ గా ఉండటం లేదు. ఫోటోషూట్స్ తో అందర్నీ ఊరిస్తోంది. తాజాగా శారీ కట్టి అల్లాడించింది ఈ గార్జియస్ నారి. జవల్కర్ సొగసుల జాతర ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది…

Exit mobile version