Site icon NTV Telugu

Priyanka Chopra : ప్రియాంక చోప్రా బర్త్‌డే‌కు.. ఊహించని షాక్ ఇచ్చిన భర్త.. !

Priyanka Chopra Birthday

Priyanka Chopra Birthday

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల తన 43వ పుట్టిన రోజు ఎంతో భావోద్వేగంగా జరుపుకుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన సత్తా చాటిన ఈ బ్యూటీకి భర్త నిక్ జోనాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జూలై 18న ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా, నిక్ జోనాస్ ఆమె కోసం మాల్దీవ్స్‌లో ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశాడు.

Also Read : Bigg Boss : గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ..

కాగా ఈ హ్యాపి ముమెంట్‌ను కుటుంబ సభ్యులతో కలిసి పర్సనల్ ఐలాండ్‌లో అద్భుతమైన వేడుకను నిర్వహించి, భార్యను ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో ప్రియాంక ఎంతో భావోద్వేగానికి లోనయింది.. సెలబ్రేషన్ అనంతరం ప్రియాంక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఈ యూనివర్స్ నాకు గొప్ప బహుమతిగా నా ఫ్యామిలీని ఇచ్చింది. నా పుట్టిన రోజు సందర్భంగా మీరు అందరూ చెప్పిన విషెస్ నాకు ఎంతో ప్రత్యేకం,అలాగే ప్రస్తుతం నేను 43వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మరింత ఆనందంగా ఉంది. నా జీవితంలో ఈ రోజు మర్చిపోలేనిది. నిక్ లాంటి భర్త లభించడం అదృష్టం’ అని ఎమోషనల్ అయ్యింది. దీంతో వారి బంధం ఎంతో పటిష్టంగా ఉండటం అభిమానులకు ఆదర్శంగా మారింది.

ప్రియాంకా తనకంటే 11 ఏళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్‌ను ప్రేమించి 2018లో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారు కుమార్తెతో కలిసి హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. నిక్ ఇచ్చిన ఈ పుట్టినరోజు గిఫ్ట్ తాను జీవితాంతం మర్చిపోలేనిది ప్రియాంక తెలిపింది.

Exit mobile version