NTV Telugu Site icon

‘బంగార్రాజు’లో నాగ్ సరసన తమిళ బ్యూటీ ?

Priyana Arul Mohan to romance with Naga Chaitanya in Bangarraju

కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయ‌న’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఈ చిత్రాన్ని జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టును నాగ్ స్వయంగా నిర్మించనున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయ‌న’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాలో నాగ చైతన్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే చైతన్యకు జోడిగా సామ్ నటించనుందని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘బంగార్రాజు’లో సామ్ లేదట… చైతన్యకు జోడిగా తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందట. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.