Site icon NTV Telugu

దారుణమైన ట్రోలింగ్… బండ, ఆంటీ అంటూ…!

Priyamani Talks About Being Body Shamed

జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణికి దారుణమైన ట్రోలింగ్ తప్పలేదట. ఈ విషయాన్నీ ఆమె తాజాగా వెల్లడించింది. పెళ్ళి తరువాత బరువు పెరిగిన ప్రియమణిని చాలామంది ‘ఆంటీ, ఫ్యాటీ’ అని, బండగా ఉన్నవని అన్నారట. దీంతో ఆమె ఎంతో కష్టపడి బరువు తగ్గిందట. అయినా ట్రోలింగ్ ఆగలేదట. ఇంకా కొంతమందికి లావుగానే కన్పిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక రంగు వివక్షత గురించి మాట్లాడుతూ కొంతమంది తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ లో ‘మీరు నల్లగా కనిపిస్తున్నారు, మీరు డార్క్ గా కనిపిస్తున్నారు’ వంటి దారుణమైన పదాలతో నింపారని చెప్పింది. అయితే ఆ ట్రోల్స్కు గట్టిగానే జవాబిచ్చింది. “నేను డార్క్ స్కిన్డ్ పర్సన్ అయితే తప్పేంటి? ముందుగా మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎవరినీ నల్లగా ఉన్నావని అనకండి… ఎందుకంటే నలుపు అందంగా ఉంటుంది” అంటూ కౌంటర్ ఇచ్చింది ప్రియమణి. ఇక ప్రియమణి దక్షిణాది స్టార్ హీరోలతో నటించడమే కాకుండా బాలీవుడ్ లో రావన్, రక్త చరిత్ర-2, అతీత్, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి హిందీ చిత్రాలలో కనిపించారు. అయితే తాజాగా వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్” సిరీస్‌లో సుచీగా ఆమె నటన పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలతో అలరించడానికి సిద్ధంగా ఉంది. హిందీలో అజయ్ దేవ్‌గన్ నటించిన ‘మైదాన్’ చిత్రంలో కూడా కనిపించనుంది.

Exit mobile version