Site icon NTV Telugu

చిక్కుల్లో పడ్డ ప్రియమణి… పెళ్ళి వివాదం!

Priyamani and Mustafa Raj's Marriage Gets into Trouble

జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి చిక్కుల్లో పడింది, తాజాగా ఆమె పెళ్లి విషయం వివాదంగా మారింది. 2007లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. కానీ ప్రియమణితో తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అతని మొదటి భార్య అయేషా ప్రకటించింది. అతను అధికారికంగా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. ముస్తాఫా మొదటి భార్య, ఆయేషా ఈ దంపతులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ప్రియమణి ముఖ్యాంశాల్లో నిలిచారు. మొదటి భార్యతో సెపరేట్ అయినప్పటికీ ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి ప్రియమణితో అతని వివాహం చట్టవిరుద్ధం. ఇది మాత్రమే కాకుండా అయేషా ముస్తఫా రాజ్ పై గృహ హింస కేసును కూడా నమోదు చేసింది.

Read Also : గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ?

ఆయేషా, ముస్తఫా రాజ్‌లకు ఇద్దరు పిల్లలు. ఆనయపై మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వివాదానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆయేషా చట్టప్రకారం ముస్తఫా ఇప్పటికీ తన భర్తేనని, ప్రియమణితో అతని వివాహం చెల్లదు అని వెల్లడించింది. కాగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో ప్రియమణి ఒకరు. ఇటీవల విడుదలైన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్‌లో సమంతా అక్కినేని, మనోజ్ బాజ్‌పేయి లతో కలిసి ఆమె నటించారు. తాజాగా ఆమె యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా “నారప్ప”లో కూడా కనిపించింది, ఇందులో వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించారు. శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.

Exit mobile version