Site icon NTV Telugu

Priyadarshi : సారంగపాణి పాటల హక్కులు కొనుగోలు చేసిన బడా సంస్థ..

Priya

Priya

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా దర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు . ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ల కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా ఇది. ఇటీవల షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ లో బిజీగా ఉంది. బలగం తర్వాత ఈ చిత్రం తనకు అంతే పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉన్నాడు ప్రియదర్శి.

Also Read : Kiran Abbavaram : నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేయండి.

కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన సంగీత హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. అలాగే వీరితో ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ఇది మూడో కాంబినేషన్. నవతరం సంచలన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయనీ గాయకు లు ఇందులో పాటలు ఆలపించారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానున్నట్టు మేకర్స్ తెలిపారు. గతంలో వచ్చిన సమ్మోహనంకు కూడా వివేక్ సాగర్ సంగీత అందించాడు. అన్ని హంగులతో ముస్తాబవుతున్నా ఈ ‘సారంగపాణి జాతకం’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20, 2024 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సీనియర్ నటులు వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కేఎల్‌కే మణి, ‘ఐమాక్స్’ వెంకట్ నటించారు.

Exit mobile version