Site icon NTV Telugu

మరోసారి స్టార్ హీరో డైరెక్షన్ లో సూపర్ స్టార్

Prithviraj Sukumaran to team up with Lalettan Mohanlal for BRO DADDY

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్‌” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు. “బ్రో డాడీ” ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాక్డౌన్ పరిమితులను ప్రభుత్వం సడలించిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.

Read Also : ‘సయ్యా జీ’ అంటూ ‘సింగిల్’గా 400 మిలియన్ల మందిని ఫిదా చేసిన నుస్రత్!

ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, కళ్యాణి ప్రియదర్శన్, మీనా, లాలూ అలెక్స్, మురళి గోపీ, కనిహా, సౌబిన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. “బ్రో డాడీ”కి పృథ్వీరాజ్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. దీనిని ఆశీర్వాద్ సినిమాస్ ఆధ్వర్యంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించనున్నారు. “బ్రో డాడీ” స్క్రిప్ట్ శ్రీజిత్, బిబిన్ రాశారు. ఈ చిత్రానికి సంగీతం దీపక్ దేవ్ కంపోజ్ చేస్తున్నారు.

Exit mobile version