Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Wedding: టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఈ రోజు (ఆగస్టు 24న) న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రిన్స్ సిసిల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో డైరెక్టర్ తేజ దృష్టిలో పడ్డారు. అనంతరం 2012లో వచ్చిన ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ‘బస్ స్టాప్’ చిత్రంతో ప్రిన్స్ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా యూత్‌లో ప్రిన్స్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ప్రిన్స్ సిసిల్.. 2017లో ప్రసారమైన ‘బిగ్ బాస్ తెలుగు’ తొలి సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ షో ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అనంతరం ‘డీజే టిల్లు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో ప్రిన్స్ సిసిల్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ సంప్రదాయ తెలుగు వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!