Pretty Pretty : ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూన్న ‘బ్యూటీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌కి ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇక అందమైన ప్రేమ కథకు, ఫ్యామిలీ ఎమోషన్‌ను జోడిస్తూ తీసే చిత్రాలకు తిరుగులేని విజయం దక్కుతుంటుంది. ఈ క్రమంలో జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. అలాంటి ‘బ్యూటీ’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఇక తాజాగా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. విజయ బుల్గానిన్ ఇచ్చిన సూథింగ్ బాణీకి సనారే రాసిన లిరిక్స్ ఎంతో ట్రెండీగా ఉన్నాయి. ఇక ఇటీవలె జాతీయ అవార్డు అందుకున్న పీవీఎన్ఎస్ రోహిత్ పాడిన ఈ పాట ఇట్టే మనసుని తాకేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ ఈ కథ తిరిగే విధానం అన్నీ కూడా ఆడియెన్స్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీకి విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా టీం ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మరింత పెంచింది. ఈ మేరకు ‘బ్యూటీ’ నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ క్యాచీగా సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్ గా బేబీ సురేష్ భీమగాని, ఎడిటర్ గా ఎస్‌బి ఉద్ధవ్ పని చేశారు. ఈ సినిమాకు బి.ఎస్.రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..