సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరకెక్కింది. రాచాల యుగంధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించగా వేడుకకు దర్శకులు యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నటుడు రమణారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ పరమవేద మాట్లాడుతూ ఎలా బతకాలో రామాయణం చెబుతుంది, రాముడు మామూలు మానవుడు. కానీ దేవుడయ్యాడు. సీత ప్రేమ కోసం యుద్దం చేయడం, రావణ సంహారం తరువాత దేవుడయ్యాడు..
Also Read; Samantha : సోషల్ మీడియాపై సమంత సంచలన వ్యాఖ్యలు..
ఈ ప్రేమ కథను తీయాలనే ఉద్దేశంతోనే సీతా కళ్యాణ వైభోగమే తీశా అన్నారు. ఆడపిల్ల పుడితే అదృష్టమని అంతా అనుకుంటాం కానీ ఆడపిల్లకు సరైన కేరాఫ్ అడ్రస్ ఉండదు, మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్ జర్నీగా చూపించానన్నారు. సందేశాత్మక చిత్రమని ప్రేక్షకులను బోర్ కొట్టించం, ప్రస్తుత తరానికి నచ్చేలా ఈ సినిమాను తీశాను. ఆడపిల్ల ఉండే ప్రతీ కుటుంబానికి ఈ సినిమా నచ్చుతుంది. సమ్మర్‌లో మా సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు. ఊరికి ఉత్తరాన సినిమాను రాచాల యుగంధర్ విడుదల చేశారు. ఈ మూవీ కథ పూర్తిగా వినకుండా నమ్మకంతో ఈ ఆఫర్ ఇచ్చారు. గరిమ ఈ పాత్రకు వంద శాతం సరిపోయింది. సుమన్ తేజ్ నా బ్రదర్ లాంటి వాడు, అద్భుతంగా నటించాడన్నారు.
