Site icon NTV Telugu

Prashanth Varma: ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ప్రశాంత్ వర్మా.. బాక్స్ ఆఫీస్ తట్టుకోగలదా?

Jai Hanuman

Jai Hanuman

హనుమాన్ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ సినిమా చివరలో జై హనుమాన్ సినిమాని 2025 లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఆ ప్రకటించిన మేరకు ఇప్పటికి పనులైతే జరగడం లేదు కానీ తాజాగా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరొక ఫోటో రిలీజ్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఒకపక్క రిషబ్ శెట్టితో ఆంజనేయుడుగా నటిస్తూనే మరోపక్క ఈ ఈ ప్రాజెక్టులో దగ్గుబాటి రానాని కూడా తీసుకొచ్చాడు. దగ్గుబాటి రానా రిషబ్ శెట్టితో కలిసి ప్రశాంత్ వలన దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది జై హనుమాన్ కాదు జై జై హనుమాన్ అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు.

Amaran: శివకార్తికేయన్‌ని బాక్సాఫీస్ బాహుబలిగా మార్చిన అమరన్!

అంటే సినిమాలో రానా కూడా భాగమవుతున్నాడు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. నిజానికి హనుమాన్ సినిమా రిలీజ్ అయిన సమయంలో గ్రాఫిక్స్ లో చూపించిన హనుమాన్ కాస్త రానాకి దగ్గరగా ఉన్నాడని కాబట్టి రానానే హనుమంతుడిగా కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. దానికి తోడు ఈ మధ్య రిలీజ్ అయిన పోస్టర్లో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామి అనే ఫీలింగ్ కలిగించినా సరే ఆయన మూతి మాత్రం నార్మల్గానే ఉంది. కాబట్టి ఆయన వేరే పాత్ర ఏమైనా చేస్తున్నారేమో ఆంజనేయ స్వామి పాత్రకి రానానే రంగంలోకి దించారేమో అనే చర్చ జరుగుతుంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన ఇస్తే తప్ప క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు.

Exit mobile version