Site icon NTV Telugu

కొత్త పెళ్లి కూతురు ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్

Pranita Subhash free vaccination drive in Bengaluru

తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వ్యాపారవేత్త నితిన్‌ రాజును మే 31న వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రణీత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల తన పెళ్లి ఆడంబరంగా జరుపుకోలేకపోయానని కొత్త పెళ్లికూతురు ప్రణీత చెప్పుకొచ్చింది. కొద్ది మంది బంధువుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వివాహం జరిగిందని ప్రణీత చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ కొత్త పెళ్లి కూతురు ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించింది. ప్రణీత ఫౌండేషన్ ద్వారా బెంగుళూరులో ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఈరోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య నిర్వహించబోతున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సినేషన్ వేయనున్నారు.

Exit mobile version