NTV Telugu Site icon

Pranayagodari : డిసెంబర్ 13న ‘ప్రణయగోదారి

Pranayagodari

Pranayagodari

విలేజ్ డ్రామాగా రాబోతోన్న ‘ప్రణయగోదారి’ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రాన్ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను మేకర్లు ప్రకటించారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్లు అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలను చూపించారు. ఇందులో సాయి కుమార్ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన వేషధారణ, ఆహార్యం, నటన ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

Also Read : DaDa : తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘డా..డా

ప్రణయ గోదారి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. పాటలు, పోస్టర్‌లు ఇలా అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న రిలీజ్ చేస్తుండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచనున్నారు మేకర్స్. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్‌లో హైప్ పెంచేందుకు  చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. మార్కండేయ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. కో డైరెక్టర్స్ గా జగదీశ్ పల్లి మరియు పురం కృష్ణ, డిజైనర్ గా TSS కుమార్, వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫర్స్ కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిట‌ర్ గా కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్ డైరెక్టర్‌గా విజయకృష్ణ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

Show comments