Pranayagodari: డిసెంబర్ 13న ‘ప్రణయ గోదారి’.. ప్రీ రిలీజ్ లో ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయ గోదారి టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది. అనంతరం దర్శక, నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నా. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను.
నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ప్రసాద్ మంచి విజువల్స్ ఇచ్చారు. చాలా కష్టపడి చిత్రాన్ని అయితే తీశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. మా సినిమా డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రసవించే సమయంలో ఎలాంటి స్థితిలో ఉంటుందో.. సినిమా రిలీజ్ టైంలో నిర్మాత కూడా అలానే ఉంటాడనిపించింది. చిన్న చిత్రమా? పెద్ద సినిమానా? అన్న తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ఉద్యమ సమయంలో కొన్ని డాక్యుమెంటరీలు నేను కూడా తీశాను. ఈ మూవీ టైటిల్ నాకు చాలా నచ్చింది. ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. డిసెంబర్ 13న రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Tags
తాజావార్తలు
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!