ప్రకాశ్ రాజ్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగువారికి ఎప్పుడో సుపరిచితుడు. ఇక ఇటీవల మా ఎలక్షన్స్ తో మరింత పాపులర్ గా మారాడు. మంచు విష్ణు తో పోటీకి దిగిన ఆయన ఓడిపోవడం, అనంతరం మా సంఘానికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. ప్రజలకు మంచి చేయడానికి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పిన ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశ్ రాజ్ మొదట లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.. 2009 లో లలితకు విడాకులు ఇచ్చి బాలీవుడ్ డ్యాన్సర్ పోనీ వర్మను వివాహమాడాడు. వీరికి ఒక కుమారుడు. ఇక ఇంటర్వ్యూలో వారి గురించి మాట్లాడుతూ.. తన పిల్లల విషయంలో ఎప్పుడు వారికి తోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన పెద్ద కూతురు పూజ చదువు పూర్తి చేసిందని, సంగీతంలో తనకు ఇంట్రెస్ట్ ఉందని, అందులో తాను ఎదగాలనుకొంటుందని చెప్పారు.
తన సినీ కెరీర్ లో హెల్ప్ చేయమంటే చేస్తా కానీ, తన పెళ్లి విషయంలో ఒక తండ్రిగా ఉండలేనని తెలిపారు. పెళ్లికి కావాల్సిన డబ్బులు పంపిస్తాను.. వారు పిలిస్తే పెళ్ళికి వెళ్లి అక్షింతలు వేస్తాను అంతే.. ఈ విషయం నా కూతరు పూజకు కూడా చెప్పాను. ఆమె కూడా ఓకే అన్నది.. అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కూతురు పెళ్లికి పిలిస్తే వెళ్లడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కుటుంబ సభ్యుల విషయంలో అంత కఠినంగా ఉంటే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు.
