Site icon NTV Telugu

వైరల్ వీడియో: ప్రగ్యా జైస్వాల్‌ వెంటపడ్డ యాచకులు

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వెంట యాచకులు పడటంతో ఆమె కాసేపు ఇబ్బంది పడ్డారు. హెయిర్ సెల్యూన్ నుంచి తిరిగివస్తుండగా ఒక్కసారిగా ఆమెకు అడ్డుతగిలారు. అప్పటికే అక్క‌డ ఆమె కోసం ఎదురు చూస్తోన్న యాచ‌కులు డ‌బ్బు ఇవ్వాలంటూ వెంటపడ్డారు. ఏం చేయాలో ప్రగ్యాకు అర్థం కాలేదు. ఆమెను క‌ద‌ల‌నివ్వ‌కుండా నిల‌బ‌డ్డారు. బౌన్సర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. ఎలాగోలా కారు ఎక్కే ప్రయత్నం చేసింది. కాగా, కారు డోర్‌ అద్దాలు పైకి ఎత్తకుండా వారు చేతులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆమె తన దగ్గరున్న డబ్బులన్ని వాళ్లకే ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రగ్యా ప్రస్తుతం బాలయ్య సరసన ‘అఖండ’లో నటిస్తోంది.

Exit mobile version