Site icon NTV Telugu

Pradeep Ranganathan : మళ్లీ డైరెక్టర్‌గా ప్రదీప్ – సైన్స్ కథతో సెట్ పైకి !

Pradeep Ranganadhan

Pradeep Ranganadhan

‘లవ్ టుడే’తో భారీ సక్సెస్ సాధించిన ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా తన మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్, ఆ తరువాత ‘డ్రాగన్’ చిత్రంతో హీరోగా మారి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రదీప్‌కు వరుస సినిమాలు లైన్‌లో ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ సినిమాల పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

Also Read: Anil Ravipudi : దిల్ రాజు కాదు.. ‘రన్నింగ్ రాజు’

ఇప్పటి వరకు హీరోగానే ప్రయాణిస్తున్న ప్రదీప్ మళ్లీ తన మొదటి ప్రేమ అయిన దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ప్రదీప్ దర్శకత్వం వహించబోయే కొత్త సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉండనుంది. ఇది మునుపటి సినిమాలకంటే భిన్నంగా, తక్కువ బడ్జెట్‌తో కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ గా సాగనుందని తెలుస్తోంది. ప్రదీప్ తన మార్క్ హ్యూమర్, ఎమోషన్లతో కూడిన రీతిలో సైన్స్ పాయింట్‌ను మిళితం చేస్తూ కథను రెడీ చేశాడు. ప్రస్తుతం రైటింగ్ టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం.

ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించనుండగా, ఇందులో హీరోయిన్ ఎవరు? అనే దానిపై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. ఎందుకంటే ప్రదీప్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఎంచుకునే కథానాయికలు యూత్‌లో తక్షణమే హిట్ అవుతుంటారు. పైగా ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉండటంతో, ఈసారి ఆయన ఎలాంటి హీరోయిన్‌ను ఎంపిక చేస్తాడో అన్నది సినీ వర్గాల్లో చర్చకు తెరలేపుతోంది. ప్రస్తుతం ప్రదీప్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక, ఈ కొత్త ప్రాజెక్ట్‌కి పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టనున్నాడు. మరి డ్రాగన్ మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కి ఎంతవరకు సంచలనం సృష్టిస్తాడో చూడాలి..!

Exit mobile version