ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్‌కి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ‘బాహుబలి’ తర్వాత ఆయన సెలబ్రిటీ స్టేటస్ అంతర్జాతీయంగా పెరిగింది. దీంతో ఆయన ప్రతి సినిమా మీదా అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ “ది రాజా సాబ్” మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుండి రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లో ప్రభాస్ విభిన్న లుక్స్‌తో, కామెడీ, హీరోయిజం రెండు చూపించి అంచనాలు రెట్టింపు చేశాడు. మారుతి ప్రభాస్‌తో ఏదో అద్భుతం చేస్తున్నాడు అని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇందులో మాళవిక మోహన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుంగా, తాజాగా ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ బయటికి వచ్చింది. అదే ఫస్ట్ సింగిల్ గురించి.
Also Read : Tripti Dimri : ప్రభాస్, హృతిక్, షాహిద్.. ట్రిప్తి రేంజ్ మాములుగా లేదుగా..!
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, “ది రాజా సాబ్” నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇది ప్రభాస్ పైనే డిజైన్ చేసిన సోలో మాస్ సాంగ్ అని సమాచారం. ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే, థమన్ సాగే మాస్ బీట్, విజువల్స్‌తో ఈ పాటకు మంచి వర్షన్ వచ్చే అవకాశం ఉందట. ఇటీవలే విడుదలైన టీజర్‌కి మాస్ రెస్పాన్స్ రాగా, థమన్ అందించిన మ్యూజిక్‌కి ప్రత్యేకంగా ప్రశంసలు లభించాయి. ఇదే ఊపులో, తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ప్రభాస్‌పై ప్రత్యేకంగా తెరకెక్కిన సోలో సాంగ్‌కు కూడా, తన మాస్ మేజిక్‌ని చూపించబోతున్నారట.
