Site icon NTV Telugu

Prabhas : వింటేజ్.. స్టైలిష్ లుక్‌లో మెరిసిన ప్రభాస్..

Prabas

Prabas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ మూవీ ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులే కాకుండా, చిత్ర బృందమంతా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. అదే సమయంలో ప్రభాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అది కూడా ఈసారి తన స్టైలిష్ లుక్ తో. ప్రస్తుతం ప్రభాస్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మొదటి నుంచి సంబంధం ఉన్న మాస్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ (SKN) తాజాగా సెట్స్ నుంచి ఓ ఫోటోను షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Kothapalli Lo Okappudu: ‘కొత్తపల్లి‌లో ఒకప్పుడు’ ట్రైలర్ రిలీజ్..

ఈ ఫోటోలో ప్రభాస్‌ కనిపించిన విధానం అభిమానుల మన్ననలు పొందుతోంది. స్టైలిష్ గా ఓ వింటేజ్ లుక్‌లో – ఓపెన్ షర్ట్, కూల్ గ్లాసెస్, లైట్ బీట్ క్రాఫ్ట్ లుక్ లో కనిపించిన ప్రభాస్ యూత్‌ఫుల్ ఎనర్జీకి ప్రతీకగా నిలిచాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి మాస్ క్లాస్ లుక్‌లో చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదే సందర్భంగా SKN చేసిన వ్యాఖ్యలు కూడా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాయి. “ఇది కేవలం ఓ బర్త్‌డే మూమెంట్ మాత్రమే కాదు, రాబోయే విజయం కోసం మొదటి సూచన కూడా..! ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయనడం గ్యారంటీ” అంటూ SKN తెలిపాడు. బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకున్న స్పెషల్ రోజున ఇలా ప్రభాస్ నుంచి వచ్చిన తాజా లుక్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Exit mobile version