Site icon NTV Telugu

Prabhas: ఫ్యాన్స్ కు ప్రభాస్ సారీ.. వీడియో రిలీజ్

Prabhas

Prabhas

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ సినిమా జపాన్​లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది.

Rahul Gandhi: అంబేద్కర్‌ని అవమానిస్తే దేశం సహించదు..

ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు ప్రభాస్. తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ క్షమాపణలు చెప్పారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని వెల్లడించిన ఆయన త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్​కు చెప్పారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరిలో ప్రభాస్​ ‘కల్కి’ని ఎంజాయ్‌ చేయండంటూ జపనీస్‌లో మాట్లాడటం గమనార్హం.

Exit mobile version