సినిమాల విషయం పక్కన పెడితే లైఫ్‌స్టైల్ విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. కారణం – ఆయన కొత్త ఇంట్లో ఏర్పాటు చేసిన ఒక విలువైన చెట్టు. అదే కల్పవృక్షం. ఈ చెట్టు కోసం ప్రభాస్ ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Lokesh Kanagaraj : ‘లియో’ ఇష్యూ.. సంజయ్ దత్‌కు క్షమాపణ చెప్పిన లోకేష్
హిందూ పురాణాలలో కల్పవృక్షంకి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవతల వనంలో ఉండే ఈ చెట్టు, భక్తుల కోరికలు తీర్చే చెట్టుగా చెప్పబడుతుంది. శాంతి, సంతానం, సంపద లాంటి ఆశయాల కోసం ఈ చెట్టును కొందరు గృహప్రవేశం సమయంలో, పూజ స్థలాల్లో లేదా ప్రత్యేకంగా ఇంటి పెరట్లో ఏర్పాటు చేస్తారు. ఈ చెట్టు వయస్సును బట్టి దాని విలువ నిర్ధారితమవుతుంది. ఇప్పుడు ప్రభాస్ కొనుగోలు చేసిన కల్పవృక్షం వయసు దాదాపు 100 ఏళ్లు. అందుకే దాని ధర ఏకంగా కోటి రూపాయలు దాటిందట. ప్రభాస్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న విలాసవంతమైన కొత్త ఇంటిలో ఈ చెట్టును ప్రత్యేకంగా దిగించి నాటించారట. ఇది కేవలం సౌందర్యానికోసం కాదు – ఓ శుభం, శాంతిగా ఉండేందుకు ఏర్పాటు చేసినదట. ఇంత వరకు ఈ రేంజ్‌లో ఉండే కల్పవృక్షం కేవలం ముఖేష్ అంబానీ ఇంట్లో ఉందని సమాచారం. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే తరహాలో స్థిరపడినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్.
