NTV Telugu Site icon

Kalki 2898 AD : ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి..

Kalki

Kalki

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Jayam : 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ క్లాసిక్ మూవీ..

దీనితో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.అద్భుతమైన విజువల్స్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో రూపొందించారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ అమరావతిలో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ మొదలవగా ఏకంగా వన్ మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి.దీనితో ఈ సినిమా ఓపెనింగ్ కే ఓవర్సీస్ లో 100 కోట్ల కలెక్షన్స్ రానున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా సెన్సషనల్ ఓవర్సీస్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది.