Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
Read Also :Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ప్రీ పోన్ కానున్న దేవర..?
ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ పరిచయం చేసారు.ఈ సినిమాలో బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్ ..ప్రభాస్ కు క్లోజ్ ఫ్రండ్ కూడా..బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.నేడు ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇవ్వనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.జూన్ 7 నుంచి ‘కల్కి 2898 AD’ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్ మొదలైంది.ఈసారి కల్కి తో ప్రభాస్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.
