Site icon NTV Telugu

Prabhas : రాజాసాబ్ రిలీజ్ డేట్ పై అనుమానం..?

Raajasaab

Raajasaab

రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు టాలీవుడ్ లో మారె ఇతర స్టార్ హీరో చేయడం లేదు. ఇప్పటికే ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ అనుదుకున్న డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.

Also Read : Balayya : కొడుకు సినిమాపై రూమర్స్ కు చెక్ పెట్టిన బాలయ్య

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి హను రాఘవపూడి సినిమా కు పూర్తీ స్థాయిలో డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు అని టాక్. రాజాసాబ్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని షూటింగ్ కూడా ఎక్కడా విరామం లేకుండా చేస్తున్నాడు దర్శకుడు మారుతి. కానీ రాజా సాబ్ గురించి లేటెస్ట్ గా ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికి సగానికి పైగా షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందట. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా అనుకున్నటైమ్ ఏప్రిల్ లో విడుదల వాయిదా పడుతుందనే చర్చ నడస్తోంది. షూటింగ్ త్వరగానే అవుతుందని కానీ ఈ సినిమాలో మేజర్ భాగం VFX వర్క్ ఉంటుందని అది రిలీజ్ నాటికి ఫినిష్ అవదని సమాచారం. ఇటీవల ప్రభాస్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది.

Exit mobile version