OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?

Og2

Og2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో OG సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా OG. ఈ సినిమాకు సీక్వెల్ ను ఇటీవల ప్రకటించారు. కానీ ఇప్పడు పవర్ స్టార్ అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించే సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పవర్ స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘OG2’ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి రీసెంట్ సర్జరీలతో పాటు దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టడమే దీనికి ప్రధాన కారణం.

పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక భుజానికి సర్జరీ చేయించుకోగా, త్వరలోనే మరొక భుజానికి కూడా ఆపరేషన్ జరగాల్సి ఉందని సమాచారం. ఈ క్రమంలో పవర్ స్టార్ పూర్తి కోలుకోవడానికి కనీసం ఆరేడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పవన్ కొన్ని నెలల పాటు నటనకు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. మరోవైపు, దర్శకుడు సుజీత్ ‘ఓజీ’ విడుదలకు ముందే తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ను నేచురల్ స్టార్ నానీతో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘బ్లడీ రోమియో’ షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే సుజీత్ ‘OG2’ పనులను ప్రారంభించనున్నారు. పవన్ రికవరీ సమయం, నానీ ప్రాజెక్ట్ గ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ‘OG2’ షూటింగ్ 2027 సెకండాఫ్‌లోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు ఏడాది తర్వాతనే పవర్ స్టార్ మూవీ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.