Site icon NTV Telugu

Pawan Kalyan: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా అప్ డేట్..

Untitled Design (10)

Untitled Design (10)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ గెలవడం మంత్రిగా భాద్యతలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రజాపరిపాలనను అందించే దిశగా అడుగులు వేస్తూ రాజకీయంగా బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన చేస్తున్న సినిమాల ప్రశ్నర్ధకంగా మారింది. ఈ మధ్య పిఠాపురం సభలో మాట్లాడుతూ OG చిత్రం పూర్తి చేస్తానని అభిమానుల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ లాస్ట్ థియేట్రికల్ రిలీజ్ 2021లో వచ్చిన వకీల్ సాబ్. కాగా OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్ త్వరలొనే పాల్గొంటాడని ఆ మేరకు నిర్మాతలకు హామీ కూడా ఇవ్వడం కూడా జరిగిందనే టాక్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో నడుస్తోంది. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో SRT బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు గతంలో ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ విషయమై నిర్మాత రామ్ తాళ్లూరిని ఓ సినిమా విలేఖరి ప్రశ్నించగా నిర్మాత మాట్లాడుతూ “కథ లాక్ చేశాం, నిర్మాణ పరంగా అన్ని సెట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు వచ్చినా మేము రెడీ గా ఉన్నాం” అని అన్నారు. మరోవైపు AM. రత్నం నిర్మించే హర హర వీరమల్లు సగం షూటింగ్ ఫినిష్ చేసి మిగతా షూట్ కోసం పవన్ డేట్స్ ఇస్తే కంప్లీట్ చేసేందుకు రెడీ గా ఉంది.

Also Read: Kollywood : రానున్న రెండు సినిమాలు హిట్ అవ్వకుంటే ఆ నిర్మాత అంతే సంగతులు

Exit mobile version