NTV Telugu Site icon

వేర్ మాస్క్ అంటున్న విక్రమ్ సహిదేవ్!

Poster from Kothaga Rekkalochena Movie

ప్రముఖ నిర్మాత శిరీష, శ్రీధర్ లగడపాటి తనయుడు విక్రమ్ సహిదేవ్. అతను హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కొత్తగా రెక్కలొచ్చెనా’! ఈ మూవీతో అలనాటి ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ బి అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సౌమిక పాండియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘ఉప్పెన’ టీమ్ ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ మూవీ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించింది. అయితే తాజాగా ఇప్పుడున్న పరిస్థితులను తెలియచేస్తూ ‘వేర్ మాస్క్, శానిటైజ్, స్టే సేఫ్’ అనే మెసేజ్ ను ఈ మూవీ హీరోయిన్లు ఓ పోస్టర్ ద్వారా ప్రజలకు తెలియ చేస్తున్నారు. రిషికా ఖన్నా, వినీత్ భవిశెట్టి, స్నేహల్ కమల్, అభిజిత్ దేశ్ పాండే, జయశ్రీ రాచకొండ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పరిస్థితులు చక్కబడ్డాక, వీలు చూసుకుని విడుదల చేస్తామని నిర్మాతలు శిరీష, శ్రీధర్ చెబుతున్నారు.