అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత ఏర్పడడంట్ ఈసిజి పరీక్ష నిర్వహించారు వైద్యులు. గతం నుంచి గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసానికి నిన్న విరేచనాలు అయ్యాయని తెలుస్తోంది. ఇక తాజాగా పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. రాజంపేటలో అందుబాటులో ఉన్న మిషనరీ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించాక మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉండడంతో కడప రిమ్స్ కు తీసుకు వెళ్లారు. అనంతరం పోసాని ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు తేల్చారు.
Chhaava: ‘ఛావా’కి యంగ్ టైగర్ వాయిస్?
విరోచనాలు కావడంతో గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించామని, గతంలో నుంచి ఆయన గుండె జబ్బుకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. పోసాని విజ్ఞప్తి మేరకే వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పోసానిని రాజంపేట నుంచి కడప తరలించారు. ఇక వైద్య పరీక్షల అనంతరం రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాతి నొప్పి అని పోసాని డ్రామా ఆడారు, పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించాము, ఆయనకే ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందని అన్నారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని ధ్రువీకరించారని, అందుకే పోసానని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నాం అని ఆయన అన్నారు.