Site icon NTV Telugu

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. కడప రిమ్స్ కి తరలింపు !

Posani Ill

Posani Ill

సినీ నటుడు, వైసిపి హయాంలో ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. కులాలు, వర్గాలపై గత ఏడాది పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరిస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే రాజంపేట సబ్ జైల్లో మార్చి 12వ తేదీ వరకు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉండాల్సి ఉంది.

Bandla Ganesh: బండ్ల గణేష్ పాదయాత్ర

అయితే రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. నిజానికి గతం నుంచి గుండెకి సంబంధించిన జబ్బుతో పోసాని కృష్ణ మురళి బాధపడుతున్నారు. నిన్న పోసాని కృష్ణ మురళి విరోచనాలకు గురవడంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు. పోసాని కృష్ణ మురళికి అక్కడి వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షలలో ఆయన ఆరోగ్యంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కి తరలించారు పోలీసులు.

Exit mobile version