ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంగా వుంది’ అలాగే అభిమానుల దీవెనలకు ధన్యవాదాలు అంటూ ఆమె రాసుకొచ్చారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయ తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ శ్రేయ ఘోషాల్ పాపులర్ సింగర్ గా పేరుతెచ్చుకున్నారు.
మగబిడ్డకు జన్మనిచ్చిన గాయని శ్రేయ ఘోషాల్
