Site icon NTV Telugu

దానికోసం తీవ్రంగా శ్రమించాను: పూజా హెగ్డే

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే.. తన పాత్రను వెల్లడించింది. స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నట్లు పేర్కొంది. రోజుల తరబడి చేసిన సాధనను ఒక గంటలోనో, అరగంటలోనో వేదికపై స్టాండప్‌ కమెడియన్స్‌ ప్రదర్శించాల్సి ఉంటుంది. పంచ్‌ లైన్స్‌తో వీక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. సన్నివేశాలకు అవసరమైనంతవరకు మాత్రమే నా స్టాండప్‌ కామెడీ స్కిల్స్‌ను చూపించాలి. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాను. ఇంతవరకు ఏ పాత్ర కోసం ఇంతలా హోం వర్క్‌ చేయలేదని చెప్పుకొచ్చింది.

Exit mobile version