NTV Telugu Site icon

Pooja Hegde : టాలీవుడ్ నాకెంతో ప్రత్యేకం..

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారింది.ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ అంతగా రావడం లేదు.ఈ భామ నటించిన రాధే శ్యాం ,ఆచార్యావంటి సినిమాలు పేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి .దీనితో ఈ భామకు స్టార్ హీరోల సరసన అంతగా ఆఫర్స్ రావడం లేదు .దీనితో ఈభామ కోలీవుడ్ ,బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించు కుంటుంది.

Read Also :Kalki 2898AD: మరో రికార్డు బద్దలు కొట్టిన కల్కి..

తన హాట్ గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకునే పూజా హెగ్డే కు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.ఈ భామ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో నటిస్తుంది.సూర్య 44 గా వస్తున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ గురించి పూజా ఆసక్తికర వ్యకాయలు చేసారు.నాకు హీరోయిన్ గా ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన టాలీవుడ్ అంటే ఎంతో ప్రత్యేకమని పూజా తెలిపింది.తెలుగులో అవకాశం వస్తే ఎంతగానో సంతోషిస్తానని ఆమె తెలిపింది.నటనకు అస్సలు ప్రాతీయ బేధం లేదు.ఏ భాషలోనైనా తనకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని ఆమె తెలిపింది.త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమాలో నటిస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది.

Show comments