Site icon NTV Telugu

ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా ‘అమరన్’!

Pooja Ceremony of Aadi Saikumar's Amaran

జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా ‘అమరన్’. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ మూవీతో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని, ఆది సాయికుమార్ సరికొత్త లుక్ తో కనిపిస్తారని, ఆ పాత్రలో కొంత కామిక్ టచ్ కూడా ఉంటుందని దర్శకుడు బలవీర్ తెలిపాడు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథాంశంతో థ్రిల్లర్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుందని నిర్మాత ఎస్వీఆర్ చెప్పారు. ఆదిత్య ఓమ్, కృష్ణుడు, మనోజ్ నందన్, వీరశంకర్, పవిత్రాలోకేశ్, మధుమణి ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు. కృష్ణచైతన్య సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version