Site icon NTV Telugu

నా మాజీ భర్త పెళ్లికి పిల్లలతో సహా వెళ్లాను : పూజా బేడీ

Pooja Bedi reveals she 'went to ex-husband's wedding with their kids'!

పూజా బేడీ… ఒకప్పుడు బాలీవుడ్ లో సంచలనం! ‘జో జీతా వహీ సికందర్’ సినిమాతో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత కొన్నాళ్లు బాగానే దూసుకుపోయింది. కానీ, పూజా బేబీ ఉన్నట్టుండీ ఫర్హాన్ ఫర్నీచర్ వాలాతో ప్రేమలో పడింది. కట్ చేస్తే, బీ-టౌన్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన యంగ్ బ్యూటీ సినిమాలు మానేసింది. తన సంప్రదాయబద్ధమైన భర్త, ఆయన ఇంట్లోని వారు కోరుకున్న విధంగా హౌజ్ వైఫ్ గా మారిపోయింది!

కెరీర్ మంచి జోరు మీద ఉన్నప్పుడు సినిమాలు మానేసి పెళ్లి చేసుకోవటం పై పూజా బడీ ఈ మధ్య స్పందించింది. తాను అప్పట్లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడైతే తీసుకోనని చెప్పింది. కానీ, ఆ వయస్సులో అదే కరెక్ట్ డిజీషన్ అనిపించిందట. అందుకే, బాలీవుడ్ వద్దనుకుని భార్యగా పన్నెండేళ్లు ఆదర్శ గృహిణి జీవితం గడిపింది. ఇద్దరు పిల్లలు … ఒమర్, అలయా ఫర్నీచర్ వాలాకు తల్లి అయింది.ఈ మధ్యే పూజా బేడీ కూతురు అలయా కూడా సైఫ్ అలీఖాన్ ‘జవానీ జానేమన్’ సినిమాతో కథానాయికగా రంగప్రవేశం చేసింది.

2003లో భర్త ఫర్హాన్ నుంచీ విడాకులు తీసుకున్న పూజా బేడీ తన గత నిర్ణయాల గురించి ఇప్పుడు పశ్చాత్తాప పడనని చెప్పింది. పెళ్లి, పిల్లలు, విడాకులు అంత ఓకే అంటోంది. ఆమె ఎక్స్ హజ్బెండ్ మరో స్త్రీని పెళ్లాడినప్పుడు… పూజా బేడీ పిల్లలతో సహా వెడ్డింగ్ కి హాజరైందట. ఫర్హాన్ ఫర్నీచర్ వాలా కూడా గోవాలో పూజా ఇంటికి వస్తూపోతూ ఉంటాడట. వారిద్దరూ పిల్లల్ని కలసే పెంచుతున్నారు! ఇక పూజా కూడా ప్రస్తుతం ఒంటరిగా ఏం లేదు! మానెక్ కాంట్రాక్టర్ అనే ఆయనతో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది!

Exit mobile version