Site icon NTV Telugu

Polimera 2 Producer: చంపేస్తామంటున్నారు… దిల్ రాజుకు పొలిమేర 2 నిర్మాత లేఖ..!

Polimera Producer Complaint

Polimera Producer Complaint

Polimera 2 Producer Gowri Krishna Writes a Letter to Dil Raju: పొలిమేర 2 సినిమా వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. పొలిమేర మొదటి భాగాన్ని ముందుగా భోగేంద్ర గుప్తా అనే నిర్మాత నిర్మించారు. పొలిమేర 2 సినిమాని మాత్రం గౌరీ కృష్ణ అనే నిర్మాత శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించారు. అయితే ఇప్పుడు పొలిమేర 3 సినిమాకి వంశీకృష్ణ నందిపాటి అలాగే ఆయన టీం నిర్మాణ సారథ్యం వహిస్తూ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత గౌరీ కృష్ణ ఇప్పటికే నందిపాటి వంశీ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని వంశీకృష్ణ, సుబ్బారెడ్డి తనని చంపే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజుకి ఒక కంప్లైంట్ చేస్తూ లేఖ విడుదల చేశారు గౌరీ కృష్ణ. నందిపాటి వంశీ అలాగే అతని టీం మీద గత ఏడాది నవంబర్ 27వ తేదీన ఒక ఫిర్యాదు చేశానని, దయచేసి దాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు.

ఈ విషయం మీకు తెలుసో లేదో కానీ ఫిలిం ఛాంబర్ కి చెందిన నిర్మాత ప్రసన్నకుమార్ మా ఇష్యూ మధ్యకు వచ్చి అతని పవర్ మిస్ యూస్ చేస్తూ ఛాంబర్ తరపున నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకం చేయాలని కూడా బెదిరిస్తున్నారు. మరోపక్క నందిపాటి వంశీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వంశీ నందిపాటి పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేశాడు. రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పటివరకు నాకు ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చెప్పడం లేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేటప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గర బ్లాంక్ చెక్కులు సంతకం చేసిన బ్లాంక్ లెటర్లు, బ్లాంక్ బాండ్ పేపర్లు సెక్యూరిటీ నిమిత్తం తీసుకుని, ఇప్పుడు వాటి ద్వారా నన్ను బెదిరిస్తున్నాడు.

దానికి తోడు పొలిమేర 3 సినిమాని నాకు చెప్పకుండానే అనౌన్స్ చేశారు. పొలిమేర 2 సినిమా నిర్మాతగా నాకున్న హక్కులను ఇది కాలరాయడమే. తెలుగు సినీ పరిశ్రమలు నమ్మి ముందుకు వచ్చే ఎంతోమంది నిర్మాతల లాగానే నేను కూడా తెలుగు ఫిలిం చాంబర్ న్యాయం వైపు నిలబడుతుందని నమ్ముతున్నాను. వీలైనంత త్వరగా ఛాంబర్ ఈ విషయంలో కలగజేసుకొని నాలాంటి చిన్న నిర్మాతలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని త్వరితగతిన పరిశీలించాలని కోరుతున్నాను. పొలిమేర 2 కలెక్షన్స్ వివరాలు నాకివ్వాల్సిందిగా అలాగే నేను సైన్ చేసిన డాక్యుమెంట్లు నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పొలిమేర స్త్రీలో పొలిమేర 2కి సంబంధించిన కంటెంట్ వాడకుండా చూడాలని కూడా కోరుతున్నాను అంటూ ఆయన లేఖ రాశారు. ఇక దీని మీద దిల్ రాజు ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది.

Exit mobile version