Pithapuramlo Ala Modhalaindi : లైవ్ కెమెరా పెట్టి తీసినట్లు ఫీల్.. ప్రేక్షకుల ముందుకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతుల మీదుగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గతంలో ‘ప్రేయసి రావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే సెన్సేషనల్ పాయింట్.. హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ అందించడం. దీనికి తోడు ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఒక కీలక పాత్రలో నటించగా.. జూనియర్ పవన్ కళ్యాణ్, కేఏ పాల్ రాము లాంటి వారు కాస్ట్ లో ఉండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
మన చుట్టూ జరిగే సంఘటనలను నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా అత్యంత సహజంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు మహేష్ చంద్ర కాన్ఫిడెంట్ గా చెప్పారు. ప్రేమ, సునిశితమైన హాస్యం, తండ్రీకూతుళ్ల మధ్య సెంటిమెంట్, యువతకు అవసరమైన సందేశం లాంటి భావోద్వేగాల కలబోతగా ఈ మూవీని రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి, విశ్వనాథన్ అండ్ సన్స్, మా ఇంటి బంగారం తరహాలోనే.. తమ సినిమా కూడా థియేటర్లలో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ అని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, రెండు పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమా విజయంపై మేకర్స్ ధీమాగా ఉన్నారు.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!