Site icon NTV Telugu

5 భారీ చిత్రాల రిలీజ్ కు టాప్ బ్యానర్ రెడీ

Pen Studio Announces New Line-up of films

భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ రోజు తమ లైనప్ చిత్రాలను రాబోయే రోజుల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్”, అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి”, రణ్‌వీర్ సింగ్ నటించిన తమిళ చిత్రం “అన్నియన్” రీమేక్, జాన్ అబ్రహం తదుపరి చిత్రం “అటాక్”, తెలుగు మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” ఉన్నాయి. “బెల్ బాటమ్” జూలై 27 న సినిమాహాళ్లలోకి వస్తుందని ముందే ప్రకటించారు. జయంతి లాల్ గడా ఆధ్వర్యంలోని పెన్ స్టూడియో వారి తదుపరి లైనప్ చిత్రాలను ప్రకటించడానికి ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

Also Read : సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ బిగ్ రిలీజ్ ఈ స్టార్ హీరో మూవీనే ?

ఈ వీడియోలో బెల్ బాటమ్, గంగూబాయి కతియావాడి, అన్నీయన్ రీమేక్, ఎటాక్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలు త్వరలో థియేటర్లలో విడుదల కానున్నాయి. అంటూ #BackToTheatre అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ఈ చిత్రాల విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ తగ్గుతుండడంతో థియేటర్లు త్వరలోనే రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలన్నీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్నాయి. పెన్ స్టూడియోస్ వారి ప్రకటన సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

Exit mobile version