సెప్టెంబర్ లో శ్రీకాంత్ తనయుడి ‘పెళ్లి సందD’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతికేళ్ల ముందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ మ్యాజిక్ ‘పెళ్లి సందడి’. ఇప్పుడు ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’తో మరోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి పెళ్లిసందడిలో శ్రీకాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
Read Also : ఆగస్ట్ 14న అమెజాన్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’
Also Read
ఈ సందర్భంగా… దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ ”అన్ని జోనర్స్‌లో బ్లాక్ బస్టర్స్ సినిమాలు తీసి ఎందరో స్టార్స్ రేంజ్‌ను పెంచిన సీనియర్ దర్శకుడు, ఎందరో హీరోయిన్స్‌ను స్టార్స్ హీరోయిన్స్‌గా మార్చిన గోల్డెన్ హ్యాండ్ మా గురువు గారు రాఘవేంద్రరావు గైడెన్స్‌లో రూపొందుతోన్న‘పెళ్లి సందD’ షూటింగ్ పూర్తయ్యింది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. రోషన్, శ్రీలీల జోడీ ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇద్దరూ ఎంతో చక్కగా, క్యూట్‌గా పాత్రలను ఫెంటాస్టిక్‌గా క్యారీ చేశారు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, ఎమోషన్స్, కామెడీ అన్ని అంశాలతో సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది. రాఘవేంద్రరావు, కీరవాణిగారి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి కీరవాణిగారు తన సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు వచ్చిన ఆదరణే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మిగిలిన పాటలను, టీజర్, ట్రైలర్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు రీ రికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?