Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?

Peddi (2)

Peddi (2)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ఈ బుధవారం ప్రీమియర్స్ తో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇన్ సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ టైటిల్ తో స్టార్ట్ అయిన పెద్ది ఫస్టాఫ్ చాలా బాగుందట. సినిమాలో వచ్చే పాటలు, ఫన్ ఎలిమెంట్స్, క్రికెట్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయట. జాన్వీ కపూర్ తన గ్లామర్ తో అలరించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్  థియేటర్లలో పూనకాలు తెప్పించే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా ఫస్టాఫ్ సూపర్బ్ గా ఉందని ఇన్ సైడ్ రిపోర్ట్.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. సినిమా కథ ఆంధ్ర నుండి ఢిల్లీకి చేరుకుంటుంది. అయితే అక్కడి నుండి కథనం కాస్త నెమ్మదిగా సాగుతుందని, మొదటి భాగంలో ఉన్నంత వేగం ఇక్కడ కనిపించదని కథ డిమాండ్ మేరకు కొన్ని ఎమోషనల్ సీన్స్ కారణంగా స్క్రీన్‌ప్లే కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా చివరి 30 నిమిషాలు వచ్చే రేస్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయని సినిమాకు ఇవి పెద్ద అసెట్ అని అంటున్నారు. రామ్ చరణ్ నటనకు ఎవరైనా కంటతడి పెట్టాల్సిందేనట. బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా వస్తుందని, రెహమాన్ మ్యూజిక్ సినిమా రేంజ్ ని పెంచుతుందట. బుచ్చి నెక్ట్స్ లెవల్ డైరెక్షన్ కు మంచి మర్క్స్ పడతాయట.  మొత్తంగా చూసుకుంటే ‘పెద్ది’ సూపర్ ఫస్టాఫ్, కొంచం స్లో సెకండాఫ్ తో సాగుతుందని సమాచారం. అయితే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో చరణ్ కనబరిచిన నటన, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరితో థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయని వీక్షకులు చెబుతున్నారు. బుచ్చిబాబు సన టేకింగ్, చరణ్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పవచ్చు.

×
×
Ad