గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీపై మరొక ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్‌లో హీట్ పెంచుతోంది. కథలో భాగంగా ఒక మాస్ నెంబర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొదట ఈ సాంగ్ కోసం యంగ్ క్రేజ్ హీరోయిన్ శ్రీ లీల పేరును పరిశీలించగా, ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ మార్చి.. ఈ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ సమంతతో చేయాలని ఫిక్స్ అయ్యాడట.
‘రంగస్థలం’లో రామ్ చరణ్ – సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ‘పుష్ప’లో ఆమె చేసిన ‘ఊ అంటావా’ ఐటెం సాంగ్ ఇంకా క్రేజ్‌లో ఉంది. అందుకే ‘పెద్ది’లో సమంత వస్తే, మాస్ ఆడియన్స్ ఫుల్ ఫీల్ అవుతారని బుచ్చిబాబు నమ్ముతున్నాడట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సమంత ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, ‘పెద్ది’లో మాస్ హంగామా మూడింతలు పెరిగేలా ఉంది.
