Site icon NTV Telugu

Payal : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం..

Payal Rajput

Payal Rajput

టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (68) జూలై 28న హైదరాబాద్‌ల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు (జూలై 30)న అంటే నేడు ఢిల్లీలో నిర్వహించనున్నారు. తండ్రి మరణవార్త పాయల్ ఆవేదనతో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె రాసిన ఎమోషనల్ పోస్ట్ హృదయాన్ని తాకుతుంది..

Also Read : Pawan Kalyan : కంగనా రనౌత్ పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్..

‘మీరు నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు గుర్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన, నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. లవ్ యు నాన్న’ అని ఆమె పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో పాయల్ రాజ్‌పుత్‌కు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, సహనటులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక పాయల్ రాజ్‌పుత్ కెరీర్ విషయాని వస్తే ‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఆమె, ప్రస్తుతం ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెంకటలచ్చిమి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version