Site icon NTV Telugu

నాకు ఊపిరాడడం లేదని తెలిపింది: పాయల్‌

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువ సంఖ్యలోనే మృత్యువాత పడ్డారు. కాగా తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతగానో ప్రేమించే అనితా ఆంటీ కరోనాతో చనిపోయినట్లుగా తెలిపింది. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. అనితా ఆంటీ చివరిగా చెప్పిన మాట.. ‘నాకు ఊపిరాడడం లేదు.’ కరోనా.. అవకాశం ఉంటే నిన్ను అంతం చేసేస్తా.. అని పాయల్‌ పేర్కొంది.

Exit mobile version