Site icon NTV Telugu

Pawan Kalyan : కంగనా రనౌత్ పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్..

Kangana Pawankalyan

Kangana Pawankalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన పొలిటికల్ విక్టరీ తర్వాత తొలిసారిగా, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. 5 ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వీరమల్ల ఎట్టకేలకు జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాను తనదైన శైలిలో ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు ఆమె కూడా ఆసక్తికరంగా స్పందించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read : Kajol : నా కుతురుని చూస్తుంటే గర్వంగా ఉంది ..

బాలీవుడ్ మీడియా ఓ ప్రత్యేక చిట్‌చాట్ సెషన్ ఏర్పాటు చేయగా, ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ను బాలీవుడ్ టాప్ హీరోయిన్స్.. అలియా భట్, కంగనా రనౌత్, కియారా అద్వానీ, కరీనా కపూర్ వంటి వారిలో ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటారు అని అడిగారు. దీనికి స్పందించిన పవన్ కంగనా రనౌత్ పేరును ఎంచుకున్నారు. ఆమె ‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో చేసిన నటనను ఎంతో పొగడుతూ.. ‘ఆమెను చూస్తే స్ట్రాంగ్ యాక్టర్ అనిపించింది’ అని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీని తర్వాత కంగనా రనౌత్ కూడా స్పందించడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఫొటోలు, ఇంటర్వ్యూక్లిప్‌ను షేర్ చేస్తూ, ఫ్రెండ్లీ కిస్, థ్యాంక్యూ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ఇది అభిమానుల్లో ఆసక్తి కలిగించింది.

Exit mobile version