Site icon NTV Telugu

Pawan Kalyan: ఇక్రిశాట్ స్కూల్ లో మార్క్ శంకర్ అడ్మిషన్!

Pawan

Pawan

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్ పటాన్‎చెరులో ఉన్న ఇక్రిశాట్‎ ను సందర్శించారు. ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ స్కూల్‎లో కుమారుడు మార్క్ శంకర్ ను చేర్పించేందుకు పవన్ ఇక్రిశాట్ కు వెళ్లారని అంటున్నారు. ఈమధ్యనే సింగపూర్‎లో అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్‎శంకర్ ను ఇక్రిశాట్ స్కూల్ లో పవన్ కల్యాణ్ చేర్పించనున్నట్లుగా సమాచారం.

Also Read:Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

అన్నా లెజినోవా, పవన్ కల్యాణ్ ల కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో సమ్మర్ కోర్సు చదువుతున్న క్రమంలో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు స్వల్పంగా గాయలవడమే కాక పొగ పీల్చడంతో శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యాడు. ఈ సంఘటన తర్వాత మార్క్ శంకర్ ను ఇండియాకు తీసుకొచ్చి కూడా వైద్య చికిత్సలు అందించారు. మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్న క్రమంలో ఇండియాలోనే స్కూల్ లో చేర్పించాలని భావించిన పవన్ కల్యాణ్ ఇక్రిశాట్ స్కూల్ లో అతడికి అడ్మిషన్ తీసుకున్నారని సమాచారం. ఆయన లోపలికి వెళ్లినా మీడియాకి మాత్రం అనుమతి నిరాకరించారు.

Exit mobile version