పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందాల్సిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘కోబలి’. రాయసీమ నేపథ్యంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కు గతంలోనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తెలియని కారణాలతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. 2013లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరువాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. తరువాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ చిత్రంతో బిజీ కాగా… పవన్ రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలు చేస్తుండడంతో త్రివిక్రమ్ ‘కోబలి’ని తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. మరోవైపు పవన్ కళ్యాణ్ బహుళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ ఇప్పుడు క్రిష్ ‘హరి హర వీరమల్లు’, అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లతో పాటు మరో ఇద్దరు దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి త్రివిక్రమ్ ‘కోబలి’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
మళ్ళీ వార్తల్లోకి పవన్, త్రివిక్రమ్ ‘కోబలి’…!
