Site icon NTV Telugu

OG: అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు.. గెట్ రెడీ?

Og

Og

Pawan Kalyan Alotted Dates to Shoot for OG Movie: యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో పవర్ స్టార్ సినిమా అనగానే.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఎందుకంటే.. సుజీత్‌ పవన్‌కి డై హార్డ్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన అభిమాన హీరోని ఏ రేంజ్‌లో చూపిస్తాడనేది.. పవన్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కేలా చేసింది. ఇక ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హంగ్రీ చీతా అంటూ రిలీజ్ చేసిన ఓజి గ్లింప్స్‌తో పూనకాలు తెప్పించాడు సుజీత్. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు.. అంటూ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ఇదే జోష్‌లో సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ పాలిటిక్స్ కారణంగా సినిమాలను కాస్త పక్కకు పెట్టారు పవన్. ఇక ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్.. తిరిగి షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

Jr NTR : ఇక గ్యాప్ లేదమ్మా.. విధ్వంసమే!

అయితే.. కెమెరా ముందుకు ఎప్పుడు వస్తాడనే విషయంలో.. ఖచ్చితమైన క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఓజి షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. 25 నుంచి 30 రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ కానుందని మేకర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో.. పవన్ ఓజి షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చిన ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి రెండు వారాల వరకు ఓజితో పాటు హరిహర వీరమల్లుకి కూడా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. దీంతో.. మూవీ మేకర్స్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే.. హరిహర వీరమల్లు కూడా మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకుంది. కాబట్టి.. ఈ ఏడాదిలో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి రిలీజ్ అవడం గ్యారంటీ.

Exit mobile version