Site icon NTV Telugu

పవన్, రానా మధ్య యుద్ధం స్టార్ట్…!

Pawan and Rana’s Fight in Ayyanum Koshiyam Remake Begins from July 11th

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న భారీ చిత్రాల జాబితాలో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ కూడా ఉంది. ఇందులో రానా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో పవన్ భార్య పాత్రను నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ రానా భార్యగా కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 4 నెలల తర్వాత షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారనేది తాజా సమాచారం. ఈ చిత్రం షూట్ జూలై 11 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుండగా… పవన్ అదే రోజు షూట్ లో చేరబోతున్నాడు.

Also Read : రివ్యూ: జగమే తంత్రం (సినిమా)

అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్ ఏర్పాటు చేయబడింది. పవన్ కళ్యాణ్, రానాల మధ్య వచ్చే ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబడతాయి. పవన్, రానా ముఖాముఖి తలపడే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని భావిస్తున్నారు. మాజీ ఆర్మీ ఆఫీసర్ గా రానా, పోలీస్ ఇన్స్పెక్టర్ గా పవన్ కళ్యాణ్… వారిద్దరి మధ్య శత్రుత్వం ఏంటి? ఎందుకు అనేది ఈ చిత్రం కథాంశం. తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్లుగా తెలుగు రీమేక్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పవన్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.

Exit mobile version