Site icon NTV Telugu

Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!

Pawankalya

Pawankalya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుండగా. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.

Also Read : Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..

ఇక ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మేకర్స్ మొదటి భాగాని జూన్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిత్ర బృందం సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. అందుకే ట్రైలర్‌ను వినూత్నంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం, దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై తెలుగు సినిమా ట్రైలర్ విడుదల కావడం ఇదే తొలిసారి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version